టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తడబడుతోంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ పాక్ పరాజయం పాలైంది. అమెరికా, భారత్ లపై గెలిచే మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దంతో సూపర్ 8కు చేరుకునే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరో రెండు మ్యాచ్ లు ఆడనుంది పాక్. ముందుగా మంగళవారం కెనడాతో తలపడుతోంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రెండు మ్యాచ్ ల్లోనూ పాక్ గెలిచినా.. అమెరికా జట్టు మిగతా మ్యాచ్ ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈరోజు కెనడాతో జరుగుతున్న మ్యాచ్ ఒకవేళ వర్షంతో ఆగిపోయినా.. పాక్ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. మరి ఇలాంటి డేంజర్ జోన్ లో ఉన్న పాక్.. సూపర్ 8కు చేరుకుంటుందో.. లేదో చూడాలి.
జట్ల వివరాలు
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం/ఆజం ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్
కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలీవాల్, పర్గత్ సింగ్, దిల్‌ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వా, డిల్లాన్ హేలింగర్, సాద్ బిన్ జాఫర్, జునై సిద్ధిఖీ, కలీమ్ సనా, జెరెమీ గోర్డాన్