న్యూఢిల్లీ : 13 ఏళ్ల అనంతరం ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు టి20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి చేరుకుంది. విశ్వవిజేతగా నిలిచి సొంత గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌సేనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనం తెలిపారు. గురువారం ఉదయం సూర్యోదయం సమయంలో ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్ల కోసం బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న అభిమానులు భారత ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాదు.. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో డాన్స్‌లతో టీమిండియా ఆటగాళ్లు అభిమానులను అలరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను కేరింతలు పెట్టించారు.
అయితే హోటల్‌కు చేరుకొని కాసేపు సేద తీరిన టీమిండియా ఆటగాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉదయం 11 గంటలకు కలుసుకున్నారు. ప్రధానితో కలిసి అల్ఫాహారం ఆరగించారు. ఈ సందర్భంగా విశ్వవిజేతగా నిలిచిన రోహిత్ సేనను ప్రధాని మోడీ అభినందించారు. భారత ఆటగాళ్లతో కలిసి సరదాగా ముచ్చటించారు. రౌండ్ టేండ్ కూర్చొని అందరూ మాట్లాడారు. కోచ్ రాహుల్ దవ్రిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌గా నిలిచిన విరాట్ కోహ్లితో మోడీ ప్రత్యేకంగా ముచ్చటించారు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌పై జోకులు పేల్చారు. టి20 వరల్డ్ కప్‌ను ప్రధాని మోడీకి కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ సంయుక్తంగా అందజేశారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగారు. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ క్రికెటర్లతో సరదాగా ముచ్చటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానుల సందడి…
ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు బిసిసిఐ అధికారులు, క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. భార త ఆటగాళ్లు అక్కడి చేరుకోవడంతో ఒక్కసారి గా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రాంగణమంతా అభిమానులతో సందడిగా మారింది. ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో హోరెత్తించారు. ‘ఇండి యా.. ఇండియా..’ అనే నినాదాలతో ఎయిర్ పోర్ట్ మొత్తం మారుమోగింది. ఇక కెప్టెన్ రోహి త్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూ పిస్తూ అభివాదం చేసాడు. ఆ తరువాత క్రికెట ర్లు అందరు బిసిసిఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బ స్సులో ఐటిసి మౌర్య హోటల్‌కు చేరుకున్నారు.