Sunday, December 22, 2024

టీ20 వరల్డ్ కప్ 2024: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ లో టీమిండియా కప్ కొడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వరుసగా 10 మ్యాచ్ లో గెలిచి జోరుమీదున్న టీమిండియా.. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయారు. దాన్నుంచి తేరకోవడానికి ఫ్యాన్స్ కు చాలా టైం పట్టింది. ఇప్పుడు మరో ప్రపంచకప్ అభిమానులను ఊరిస్తుంది. 2024 జూన్ లో జరగబోయే టీ20 ప్రపంచకప్ పైనే అందరీ చూపులు ఉన్నాయి. ఈ సారైనా భారత్ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ మెగా టోర్నీలో భారత్ కప్ గెలువడం అంత సులువేమీ కాదు.. ఎందుకంటే, ఈ మెగా టోర్నీ విదేశాల్లో జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్‌ దేశాలు ఈ మెగా పోరుకు ఆతిథ్యం ఇస్తున్నాయి.

విదేశీ పిచ్ లపై మనోళ్లు రాణించడంపైనే కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే.. ఈ టోర్నీలో అభిమానులకు అసలు కిక్కిచ్చేది భారత్-పాక్ మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. అయితే, దాయాదుల పోరు జూన్ 9న జరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 9న భారత్-పాక్ తలపడనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజీలో భారత్ ఐదు మ్యాచ్ లు ఆడనుంది.

టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ తొమ్మిది సార్లు విజయం సాధించగా… పాకిస్థాన్ మూడు సార్లు మాత్రమే గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News