Saturday, November 9, 2024

జూన్ 9న భారత్‌-పాక్ పోరు

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ ఒకటిన ప్రారంభమయ్యే ప్రపంచకప్ జూన్ 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరు జట్ల మధ్య జూన్ 9న అమెరికాలోని న్యూయార్క్ వేదికగా పోరు జరుగనుంది. జూన్ 1న అమెరికాకెనడా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. డల్లాస్‌లో ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న వెస్టిండీస్‌లోని బార్బడాస్‌లో నిర్వహించనున్నారు. అమెరికాలోని మూడు, వెస్టిండీస్‌లో ఆరు వేదికల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, జూన్ 26న తొలి సెమీస్, 27న రెండో సెమీస్ జరుగుతాయి. సెమీస్ మ్యాచ్‌లకు గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాకో నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇదిలావుంటే వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్‌ఎలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడాలతో పాటు అమెరికా జట్లకు చోటు దక్కింది. గ్రూప్‌బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమాన్, గ్రూప్‌సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండా, పపువా న్యూగినియా, గ్రూప్‌డిలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లకు స్తానం దక్కింది.

భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
వరల్డ్‌కప్‌లో టీమిండియా గ్రూప్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ జూన్ ఐదున ఐర్లాండ్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఎదుర్కొనుంది. ఇక మూడో మూడో మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో ఢీకొంటోంది. ఈ మ్యాచ్ జూన్ 12న జరుగనుంది. భారత్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు న్యూయార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 15న ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. కాగా, టీమిండియాపాకిస్తాన్, ఆస్ట్రేలియాఇంగ్లండ్, సౌతాఫ్రికాశ్రీలంక, బంగ్లాదేశ్‌శ్రీలంక, న్యూజిలాండ్‌విండీస్, విండీస్‌అఫ్గానిస్థాన్, నమీబియాస్కాట్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ప్రపంచకప్‌నకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News