Sunday, November 3, 2024

టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

 పాక్‌పై ఆసీస్ జయభేరి.. టైటిల్ పోరుకు ఆస్ట్రేలియా
వార్నర్ జోరు, వేడ్, స్టోయినిస్ మెరుపులు..షాదాబ్ శ్రమ వృథా

T20 World Cup: Aus Won by 5 wickets against PAK

దుబాయి: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టైటిల్ సమరానికి చేరుకుంది. న్యూజిలాండ్ ఇంతకు మందే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ సమరం జరుగుతుంది. ఇక చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు సంచలన విజయం అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లు జట్టుకు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆజమ్ (39) పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 4 భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. ఇక ఫకర్ జమాన్ కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫకర్ జమాన్ 4 భారీ సిక్స్‌లు, మూడు ఫోర్లతో 32 బంతుల్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. దీంతో పాక్ భారీ స్కోరును సాధించింది.
వార్నర్ మెరుపులు..
ఇక క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మూడో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ అరోన్ ఫించ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మిఛెల్ మార్ష్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును లక్షం దిశగా నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 28 పరుగులు చేసి షాదాబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే స్మిత్ (5) కూడా ఔటయ్యాడు. మరోవైపు ధాటిగా ఆడిన వార్నర్ 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మాక్స్‌వెల్(7) కూడా నిరాశ పరిచాడు. షాదాబ్ కీలకమైన నాలుగు వికెట్లను తీసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు.
స్టోయినిస్, వేడ్ పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను గెలిపించారు. ధాటిగా ఆడిన వేడ్ 4 సిక్సర్లు, రెండు పోర్లతో అజేయంగా 41 పరుగులు చేశాడు. స్టోయినిస్ రెండు సిక్సర్లు, మరో రెండు బౌండరీలతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరింది.

T20 World Cup: Aus Won by 5 wickets against PAK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News