Monday, December 23, 2024

టీమిండియా ఘోర పరాజయం.. ఫైనల్ కు ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ( 40 బంతుల్లో 50 పరుగులు), హార్ధిక్ పాండ్యా(33 బంతుల్లో 63 పరుగులు)లు రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమవ్వడంతో ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్(80 నాటౌట్), హేల్స్(86 నాటౌట్)లు ఇండియా బౌలర్లను ఉతికారేశారు. దీంతో 16 ఓవర్లలోనే ఇంగ్లండ్ జట్టు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఇక, ఆదివారం జరిగే ఫైనల్ లో పాకిస్తాన్ జట్టుతో ఇంగ్టండ్ తలపడనుంది.

T20 World Cup: ENG Won by 10 wickets against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News