లండన్: అతి తక్కువ సమయంలో వరసగా మూడు టోర్నమెంట్‌లు ఆడడం చాలా కష్టమని, అందుకే తాను ఐపిఎల్‌కు బదులుగా టి20 ప్రపంచ కప్‌ను, యాషెస్ సిరీస్‌ను ఎంచుకున్నానని ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్ చెప్పాడు. ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే వోక్స్ త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్‌రెండో దఫా మ్యాచ్‌లకు దూరం కావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అతనితో పాటుగా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాన్ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యుడైన మరో ఆటగాడు డేవిడ్ మలన్‌లు కూడా ఐపిఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. రెండు నెలలక్రితం వరకు ప్రపంచకప్ జట్టు లో నేను ఉంటానని అనుకోలేదు. అయితే ఐపిఎల్ రీషెడ్యూల్ కావడం.
అది మా వేసవి చివర్లో జరుగుతుండడం సంభవించాయి అని వోక్స్ ‘ది గార్డియన్’ పత్రికతో మాట్లాడుతూ అన్నాడు. ‘ప్రపంచ కప్, యాషెస్ కూడా అదే సమయంలో ఉండడంతో ఐపిఎల్‌లో పాలు పంచుకోవడానికి నాకు సమయం లేకపోయింది. ఐపిఎల్‌లో ఆడడం నాకు కూడా చాలా ఇష్టమే. అయితే దేన్నో ఒకదాన్ని వదులుకోక తప్పలేదు’ అని వోక్స్ చెప్పాడు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల ఐపిఎల్‌నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ స్థానంలో ఆస్ట్రేలియా ఎడంచేతి వాటం బౌలర్ బెన్ ద్వార్‌శిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది.
T20 World Cup important more than IPL: Chris Walks