Thursday, January 23, 2025

మెగా టోర్నీకి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: ఐపిఎల్ మెగా టోర్నమెంట్ ఇలా ముగిసిందో లేదో మరో పొట్టి క్రికెట్ టోర్నీ అభిమానులను కనువిందు చేసేందుకు సిద్ధమైంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా 9వ టి20 ప్రపంచకప్‌నకు శనివారం తెరలేవనుంది. జూన్ ఒకటిన డల్లాస్ (అమెరికా)లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి జూన్ 29న బార్బడొస్ వేదికగా జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. ఈసారి వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లను ఎ,బి,సి, డి అనే నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లకు స్థానం దక్కింది.

దాయాది జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఈ వరల్డ్‌కప్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారింది. జూన్ 9న అమెరికాలోని న్యూయర్క్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. గ్రూప్‌బిలో ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్ జట్లకు చోటు లభించింది. గ్రూప్‌సిలో అఫ్గానిస్థాన్, ఉగాండా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పపువా న్యూ గునియా, గ్రూప్‌డిలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, గయానా, బార్బడొస్,అంటిగువా, ట్రినిడాడ్, కింగ్స్‌టౌన్, సెయింట్ లూసియా, న్యూయార్క్ వేదికలుగా ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

కాగా,లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. కాగా, లీగ్ దశ మ్యాచ్‌లు జూన్ 8నముగుస్తాయి. జూన్ 19 నుంచి సూపర్8 మ్యాచ్‌లకు తెరలేస్తోంది. గ్రూప్ 8లో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్‌లో రెండో సెమీస్ జూన్ 27న గయానాలో జరుగుతుంది, ఇక ఫైనల్ పోరు జూన్ 29న బార్బడొస్ వేదికగాజరుగనుంది. కాగా, ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News