న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్ తన కెరీర్‌లో తీపిజ్ఞాపకంగా మిగిలిపోతుందని భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు. విండీస్ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ బౌలర్ సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌కు తుది జట్టులో చోటు ఇచ్చాడు. ఇక అర్ష్‌దీప్ కూడా కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.
దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. భారత్ విశ్వవిజేతగా నిలువడంలో అర్ష్‌దీప్ పాత్ర కూడా చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు వరల్డ్‌కప్ ప్రదర్శనపై అర్ష్‌దీప్ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ తనకు చిరకాలం గుర్తుండి పోతుందన్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి వికెట్‌ను తీయడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నాడు. ఈ ప్రదర్శన తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఎంతో మంది ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నారని, వాటి పోటీని తట్టుకుని జట్టులో స్థానం సంపాదించడం గర్వంగా ఉందని అర్ష్‌దీప్ పేర్కొన్నాడు.