సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఇక గురువారం ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఫైనల్లో పాక్ తలపడుతోంది. ఇక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లు జట్టుకు శుభారంభం అందించారు. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రిజ్వాన్, ఆజమ్‌లు ఈ మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ 42 బంతుల్లో ఏడు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. మరోవైపు రిజ్వాన్ ఐదు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మహ్మద్ హారిస్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు.
దీంతో పాకిస్థాన్ విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. షహీన్ అఫ్రిది మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. కివీస్ జట్టులో డారిల్ మిఛెల్ (53), కెప్టెన్ విలియమ్సన్ (46), కాన్వే (21) మాత్రమే కాస్త రాణించారు.
T20 World Cup: PAK beat NZ by 7 wickets