Monday, December 23, 2024

120 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: Pakistan lost 7 wickets for 120 runs

మెల్బోర్న్: మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. 120 పరుగులకే పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయింది.  టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. టి-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో వికెట్ పడగొట్టాడు. 14వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. 16వ ఓవర్లో మరోసారి సత్తా చాటాడు. హార్దిక్ వేసిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్ అవడంతో మహమ్మద్ నవాజ్ ఆ బంతిని షార్ట్ థర్డ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని గ్లవ్‌ను తాకిన బంతి కీపర్ చేతుల్లో పడింది. దీంతో ఆ జట్టు 16 ఓవర్లకు 116/6 స్కోరుతో నిలిచింది. మరుసటి ఓవర్లో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ కూడా మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో పాక్ జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి 125/7 స్కోరుతో నిలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News