Monday, December 23, 2024

టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

T20 World Cup schedule finalized

అక్టోబర్ 23న పాక్‌తో భారత్ పోరు
నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ సమరం

దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా వరల్డ్‌కప్ జరుగనుంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్2లో భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్1లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లకు చోటు దక్కింది. మరో నాలుగు జట్లు క్వాలిఫయింగ్ పోటీల ద్వారా మెయిన్‌డ్రాకు అర్హత సాధిస్తాయి. ఇక నవంబర్ 9న తొలి, 10న రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ సమరం 13న మెల్‌బోర్న్ వేదికగా నిర్వహించనున్నారు.

నిజానికి రెండేళ్ల క్రితమే ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా దీన్ని వాయిదా వేయక తప్పలేదు. ఇక ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన వరల్డ్‌కప్‌ను ఈ ఏడాదికి మార్చారు. అంతకుముందు జరిగిన వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో కిందటి ఏడాది ఈ వరల్డ్‌కప్‌ను భారత క్రికెట్ బోర్డు యుఎఇ, ఒమన్ వేదికగా నిర్వహించింది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలిచింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో భారత్ భారీ ఆశలతో బరిలోకి దిగనుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఇది సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News