Monday, December 23, 2024

నేటి నుంచి సూపర్-12 సమరం

- Advertisement -
- Advertisement -

 T20 World Cup:Super-12 from today

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో కివీస్‌ఢీ

సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో అసలైన సమరానికి శనివారం తెరలేవనుంది. క్వాలిఫయింగ్ పోటీలు శుక్రవారంతో ముగిసాయి. ఇక శనివారం నుంచి సూపర్12 పోటీలు జరుగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఇంగ్లండ్ పోటీపడనుంది. సూపర్12లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్2లో భారత్‌తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు చోటు సంపాదించాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం పోరు జరుగనుంది. ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లలన్నీ అమ్ముడు పోయాయి. ఇక నవంబర్ 9, 10 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు, నవంబర్ 13న తురి పోరు జరుగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News