Monday, January 27, 2025

త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయాణికులకు ‘టి24’ టికెట్

- Advertisement -
- Advertisement -

‘T24’ ticket for joint Warangal district travelers soon
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసిని ప్రజలకు మరింత చేరువ చేసి, ప్రయాణికుల ఆదరణ పొందేలా సంస్థ ఎండి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా సంస్థలో వస్తున్న మార్పులు సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విజయవంతమైన టి24 టికెట్‌ను వరంగల్ ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని ఎండి సజ్జనార్ నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒకే టికెట్‌తో రోజంతా ప్రయాణం చేసేవారి కోసం టి24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘టి-24’ ప్రయాణికులకు ఎంతో లాభంగా ఉండడంతో దీనిని వరంగల్ నగరంలోని సిటీ బస్సుల్లో అమల్లో తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ముందుకెళుతున్నట్టు ఎండి ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై-సిటీల్లో కేవలం రూ.50లకే టి-24 టికెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండి సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతోపాటు పండుగలు, ఉత్సవాలు, జాతరలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఇంటికే బస్సు పంపించేందుకు సిద్ధమని సజ్జనార్ ప్రకటించడంతో ఆ సంస్థకు మరింత ఆదాయం తెస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News