Monday, January 20, 2025

టి9 టికెట్లను 3 రోజుల పాటు నిలిపివేసిన ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాఖీ పౌర్ణమి తిరుగు ప్రయాణం రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను మరో మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిలుపుదల అమల్లో ఉండగా.. దానిని సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది.పల్లె వెలుగు బస్ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 60 కిలో పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60ని, 30 కిలో మీటర్లు టి-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి.

టి-9-60 టికెట్ను రూ.100కు, టి-9-30ని రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది. ‘గత ఏడాది మాదిరిగానే ఈ రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. రద్దీ ఉన్నప్పుడు టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయడం కష్టం. సమయం కూడా వృథా అవుతుందని భావించిని ఆర్‌టిసి వీటిని నిలిపివేయాలనే నిర్ణయం తీసుకుంది.
తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో తాజాగా దానిని మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ‘సెప్టెంబర్ 4 వరకు టి-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుంది. 5వ తేదీ నుంచి అవి యథాతథంగా కొనసాగుతాయి’ అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండి విసి సజ్జనర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News