Thursday, December 26, 2024

ఆ క్వాలిటీ చూసి అతడిని ప్రేమించా: తాప్సీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ప్రియుడు మథియాస్ బో గురించి టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ తెలిపింది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి మథియాస్ తో తాప్సీ ప్రేమాయణం నడిపిస్తోంది. తన ప్రియుడి గురించి తాప్సీ నోరు విప్పింది. మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు అని, అతడితో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ ప్రేమజంట త్వరలో వివాహం చేసుకుంటుందని వార్తలు వైరల్ అవుతన్నాయి. తాన కొంత మంది అబ్బాయిలతో స్నేహం చేశాను, కానీ ఎవరి వ్యక్తిత్వం తనని ఆకట్టుకోలేదని, పురుషుల్లో నిజాయితీతో పాటు జీవితం పట్ల పరిణతి ఉండాలని తాను నమ్ముతున్నానని తాప్సీ వివరించింది. ఆ లక్షణాలు మథియాస్‌లో బోలెడు ఉన్నాయని, అతడు తన జీవితానికి భద్రత కల్పించగలడు అని నమ్మకం కలిగిందని పేర్కొంది. అతడితో గడిపినప్పుడు గొప్ప వ్యక్తిత్వం తెలియడంతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సమయం వచ్చినప్పుడు అని విషయాలు బయటకు చెబుతానని తాప్సీ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News