Monday, December 23, 2024

ప్రతీ విద్యార్థికి ట్యాబ్ ఇస్తాం: జగన్ మోహన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Tab give to every student

 

అమరావతి: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆదోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ విద్యార్థులతో జగన్ ముచ్చటించారు. విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చామని, విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నామని, పాఠాలు సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు బైజూస్ యాప్ ను అందుబాటులోకి తీసుకరాబోతున్నామన్నారు. పిల్లల భవిష్యత్ పై దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం ఎపి ప్రభుత్వమన్నారు. జగనన్న గోరుముద్దతో స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం లభిస్తోందన్నారు.

2020-21లో విద్యాకానుక కింద రూ.648 కోట్లు ఖర్చు చేయడంతో 42.34 లక్షల మంది లబ్ధి చేకూరగా,  2021-22లో విద్యాకానుక కింద రూ.789 కోట్లు ఖర్చు చేయడంతో 45.71 లక్షల మంది లబ్ధి చేకూరిందన్నారు. మూడో ఏడాది విద్యాకానుక కింద రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 47.4 లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. 8వ తరగతిలో అడుగుపెట్టే ప్రతీ విద్యార్థికి ట్యాబ్ ఇస్తామని జగన్ చెప్పారు. రూ.12 వేల ట్యాబ్ లను విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతీ ఇంట్లోనూ చదువు ఉండాలన్నారు. బాగా చదువుకుంటేనే ప్రపంచంలో ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News