Tuesday, January 21, 2025

‘భోలా’ సెట్స్‌లో గాయపడిన టబు

- Advertisement -
- Advertisement -

Tabu gets injured on sets of Bholaa

హైదరాబాద్: సీనియర్ నటి టబు ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడింది. ఆమె ప్రస్తుతం అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘భోలా’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో టబు ఓ పోలీస్ అధికారిణిగా పాత్ర పోషిస్తోంది. ఆమెపై హైదరాబాదులో చేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును ఆసుపత్రికి తరలించారు. అటు, మరో సీనియర్ నటి శిల్పాశెట్టి కూడా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో గాయపడిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News