- Advertisement -
హైదరాబాద్: దేశ చేనేత పరిశ్రమలో తెలంగాణ చేనేతకు తనదైన స్థాయి ఉంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద నడిచేందుకు ప్రముఖ నటి టబు ముందుకొచ్చింది. ఫ్యాషన్ షోలో తెలంగాణలో తయారైన 50కి పైగా చీరలు, వస్త్రాలను ప్రదర్శించారు. కాగా టబు ఘరార, షార్ట్ కుర్తా, దుప్పట్టా ధరించి ఆకట్టుకున్నారు(షోస్టాపర్). తెలంగాణ చేనేత సహకార సంఘం(టిఎస్‌సిఓ)శాఖ నిర్వహించిన ఈవెంట్‌లో టబు అలరించారు. పోచంపల్లి, పుట్టపాక, గద్వాల్, నారాయణ్‌పేట్ తదితర తెలంగాణ ప్రసిద్ధ వస్త్రాలు ధరించి మోడల్స్ అలరించారు.
- Advertisement -