- Advertisement -
అమరావతి: తాండ్ర పాపారాయుడు స్ఫూర్తితో సైకో జగన్‌పై పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బొబ్బిలిలోని రాజకాళాశాల మైదానంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ జనవాహినిని చూసిన తరువాత తాడేపల్లి తలుపులు బద్ధలు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని, ప్రజల కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాను పోరాటం చేస్తున్నామన్నారు. నూతన సంవత్సరం రాష్ట్ర స్వర్ణయుగానికి సంకల్పం తీసుకొస్తుందన్నారు. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని బాబు హామీ ఇచ్చారు.
- Advertisement -