Friday, January 17, 2025

తెల్లవారితే నిశ్చితార్థం… యువతి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తల్లి అనారోగ్యం బాగోలేకపోవడంతో కూతురుకు త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం కూతురు గోరింటాకు పెట్టుకొని వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని ఆమె మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. వెంకటరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరామ్‌రెడ్డి-లక్ష్మీదేవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ముగ్గురు బీటెక్ చదివారు. తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

తల్లి కోరిక మేరకు పెద్ద కుమార్తె గీత(24) పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంబంధం కుదరడంతో ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు. చేతికి గోరింటాకు పెట్టుకోవడానికి తన తమ్ముడు నారాయణ రెడ్డితో కలిసి తాడిపత్రికి వెళ్లింది. తాడిపత్రి నుంచి వెంకటరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తమ్ముడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నారాయణ రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పెళ్లి ముచ్చట తీరకుండానే కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. సిఐ శివగంగాధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News