Thursday, January 23, 2025

తాడిపత్రి సిఐ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనంతరపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి టౌన్ సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరివేసుకుని సిఐ ఆనందరావు బలవర్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే సిఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News