మన తెలంగాణ /సిటీ బ్యూరో: దేశీయంగా ట్రాక్టర్లలో అగ్రగామి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు సంస్థ టఫె టాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ సర్వీస్ క్యాంపెయిన్ “ మాస్సే సర్వీస్ ఉత్సవ్‌ను ప్రారంభించింది. తద్వారా సౌకర్యవంతమైన సాగు సీజన్ కోసం రైతులకు మరింత భరోసా అందించనుంది. మాస్సే సర్వీస్ ఉత్సవ్ ప్రధాన లక్షం ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు దేశవ్యాప్తంగా అత్యున్నత శ్రేణి సేవా అవకాశాలను 1500కు పైగా ఆధకృత వర్క్‌షాప్‌ల ద్వారా 3వేలకు పైగా సుశిక్షితులైన మెకానిక్స్‌తో సేవలందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడం, ఈ నిర్వహణ సేవలలో భాగంగా ప్రతి ట్రాక్టర్‌కు 25 నుంచి 44 పాయింట్లను చెకప్ చేయనునాన్నరు. అంతేకాకుండా ప్రతి ట్రాక్టర్ యజమానికి అత్యంత ఆకర్షనీయమైన ఆఫర్ల ప్రయోజనం కలిగిలే రాయితీలు, ఆయిల్ సేవలపై బహుమతులు అందజేయనున్నారు. వీటితో పాటు రూ.4 వేలపైబడి బిల్లులకు సంబంధించ పన్నులో 15 శాతం రాయితీ ఇవ్వడంతో పాటు ఇంతకన్న తక్కువ ఉన్న బిల్లులకు సంబంధించి విడిభాగాలపై 3.5 శాతం, ఇంజన్ ఆయిల్‌పై 10 శాతం లేబర్ ఛార్జీలపై 50 శాతం, అగ్రిస్టార్ బ్లేడ్స్‌పై 20 శాతం రాయితీలను మాస్సె సర్వీస్ ఉత్సవ్ కింద అందించనున్నారు.
టఫె ట్రాక్టర్స్ మాస్సే సర్వీస్ ఉత్సవ్ ప్రత్యేక ఆఫర్లు…. అత్యున్నత సేవలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -