Sunday, April 13, 2025

నాడు పలు నగరాల్లో దాడులకు రాణా కుట్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముంబై ఒక్కటే కాకుండా భారతదేశంలోని ఇతర నగరాలలో కూ డా మారణహోమం సృష్టించడానికి విలన్ తహవూర్ హుస్సేన్ రాణా య త్నించాడు. 26/ 11ముంబై దాడులను పకడ్బందీగా అమలు చేసేందుకు రంగంలోకి దిగిన రాణా విధ్వంసరచన వివరాలు ఇప్పుడు ఆయన ఆటకట్టుతో తేటతెల్లం అయింది. రాణా కీలక ఉగ్రపాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కూలంకుషంగా దృష్టి సారించింది. అరెస్టు తరువాత స్థానిక ఢిల్లీ కోర్టు ముందు రాణా వ్యవహారం గురించి శుక్రవారం ఎన్‌ఐఎ తమ వాదన విన్పించింది.

ముంబై ఒక్కటే కాకుండా ఇతర నగరాలు, ప్రాంతాలను కూడా రాణా టార్గెట్ చేసుకున్నాడని , దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి సాక్షాధారాలు ఉన్నాయని సంస్థ తమ వివరణలో తెలిపింది. రాణాను 18 రోజుల ఎన్‌ఐఎ కస్టడీకి ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ఆదేశించారు. దీనితో ఇక రాణానుంచి టెర్రర్ ప్లాన్‌పై మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్‌ఐఎ రంగంలోకి దిగింది. రాణాకు ప్రతి 24 గంటలకు ఓసారి వైద్య పరీక్ష చేయాలి. ఆయన దినం విడిచి దినం తమ లాయర్‌ను కలిసేందుకు వీలు కల్పించాలని కూడా జడ్జి సూచించారు. రాణా దాడుల వ్యూహం చాలా విస్తృతంగా ఉంది. పలు ప్రాంతాలకు విస్తరించుకుని ఉంది.దీనితో ఆయనను దేశంలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ అధికారులు న్యాయమూర్తికి తెలిపారు. దీనితో ఇకపై రాణాను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి , క్షేత్రస్థాయిలో విచారించేందుకు వీలుంటుంది. భారీ స్థాయి కుట్ర కోణం ఇమిడి ఉంది. దీనిని సమగ్ర రీతిలో వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ‘

రాణా కీలక పాత్రధారి అయినప్పటికీ , ఆయన వెనుక ఉన్న ఇతర శక్తులను ప్రత్యేకించి పాకిస్థాన్ పాత్రను వెలుగులోకి తీసుకురావల్సి ఉంటుంది. ఈ దిశలో నియా చాలా వరకూ సాక్షాలను రాబట్టుకుంది. ఇంతకాలం పాక్ పాత్ర గురించి భారత దర్యాప్తు సంస్థలు చెపుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ముంబై కుట్రధారు విచారణకు అందుబాటులోకి రావడంతో ఇకపై ఆయన ద్వారా పాకిస్థాన్ పాత్ర గురించి మరింతగా వివరాలను రాబట్టుకునేందుకు వీలుంటుంది. 17 సంవత్సరాల క్రితం నాటి పరిణామాలను ఆరా తీయాల్సి ఉంటుంది. ముంబైలో వినియోగించుకున్న దాడి వ్యూహాలను ఇతర నగరాలలో కూడా అమలు చేసేందుకు రాణా బృందం వ్యూహరచన చేసినట్లు ఎన్‌ఐఎ పేర్కొంది. దీనికి సంబంధించి న్యాయమూర్తి ఎదుట నియా వాదన కీలకం అయింది. రాణాను కోర్టులో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రవేశపెట్టారు. ఎన్‌ఐఎ డిఐజి , ఓ ఐజి, ఐదుగురు డిసిపిల స్థాయి అధికారులు, ఢిల్లీ పోలీసు అధికారులు కోర్టుకు వచ్చారు.18 రోజుల పాటు రాణా దర్యాప్తు సంస్థ అదుపులో ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News