- Advertisement -
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిందితుడు.. పాకిస్థాన్‌కు చెందిన తహపూర్ రాణా భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి రాణాను తీసుకువచ్చిన విమానం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌కి గురువారం మధ్యాహ్నం చేరుకుంది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ.. రాణా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమైన విషయం తెలిసిందే. రాణాను తీసుకువచ్చిన నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే అతన్ని ఎన్‌ఐఎ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే అతన్ని ఎన్‌ఐఎ కోర్టులో హాజరు పరిచి అక్కడ నుంచి తీహార్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.
- Advertisement -