Saturday, January 4, 2025

భారత్‌కు తహవ్వుర్ రాణా అప్పగింతకు రంగం సిద్ధం

- Advertisement -
- Advertisement -

భారత్‌కు భారీ దౌత్య విజయంగా 2008 ముంబయి ఉగ్ర దాడుల్లో పాత్ర ఉందని ఆరోపణకు గురైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అమెరికా అప్పగించబోతున్నది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు రాణాను ఎఫ్‌బిఐ 2009లో షికాగోలో అరెస్టు చేసింది. భారత్, యుఎస్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం రాణాను భారత్‌కు అప్పగించవచ్చునని 2024 ఆగస్టులో యుఎస్ నైన్త్ సర్కూట్ అప్పీళ్ల న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

తన అప్పగింతకు మేజిస్ట్రేట్ జడ్జి ధ్రువీకరణను సవాల్ చేస్తూ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత న్యాయస్థానం ఆ నిర్ణయం వెలువరించింది. 26/11 దాడుల్లో రాణా ప్రమేయానికి అతని అప్పగింతను భారత్ కోరింది. 26/11 దాడుల సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ ఎల్‌ఇటి టెర్రరిస్ట్ డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీకి రాణా సాయం చేశాడని ఆరోపించారు. ముంబయిలో దాడులకు గురైన ప్రదేశాల రెక్కీని హెడ్లీ నిర్వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News