Wednesday, January 22, 2025

నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు.. పట్టపగలే టైలర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టినందుకు
పట్టపగలే టైలర్ దారుణ హత్య, ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత
జైపూర్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. టైలర్ తన షాపులో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. దుండగులను గౌస్ మహ్మద్, రియాజ్‌గా గుర్తించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ, నుపూర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. ఇస్లాంను అవమానించనందుకే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. టైలర్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్‌నెట్ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా టైలర్ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది.

Tailor murdered in Udaipur after support Nupur Sharma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News