Saturday, November 23, 2024

కుట్టు శిక్షణ.. మీ ఉపాధికి రక్షణ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మీ కాళ్లపై మీరు నిలబడాలన్నదే ప్రభుత్వ ఆలోచన

ఎస్సి కార్పొరేషన్ ద్వారా మహిళలకు చేయూత

త్వరలో జిల్లా వ్యాప్తంగా మరో 200 మందికి శిక్షణ, మిషనరీ ఇప్పిస్తాం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

Tailoring training for employment

సిద్ధిపేట : స్వయం ఉపాధి పొంది మీ కాళ్లపై మీరు నిలబడాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్సి కార్పొరేషన్, సెట్విన్ సంయుక్తంగా మూడు నెలలు టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కుట్టు శిక్షణ మీ ఉపాధికి రక్షణగా ఉంటుందని ప్రభుత్వం ఎస్సి కార్పొరేషన్, సెట్విన్ ద్వారా మహిళలకు చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత డొమెస్టిక్ మిషన్లు కాకుండా టైలరింగ్ మిషన్లు ఎప్పటికీ మీకు కమర్షియల్ గా ఉపయోగపడేలా ఇస్తున్నట్లు, శిక్షణ, మిషనరీలకు రూ.11, 98, 400 లక్షల రూపాయల వ్యయంతో ఇప్పటి వరకు 40 మంది ఎస్సిలకు మంజూరు చేశామన్నారు. టైలరింగ్ మిషన్లతో పాటు ఐరన్ బాక్స్, టూల్ కిట్ రూ.16 వేల రూపాయల విలువ కలిగిన సామాగ్రి అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

త్వరలోనే ప్రారంభించనున్న శిక్షణలో సిద్ధిపేట పట్టణ ప్రాంత వాసులకు 100 మందికి శిక్షణ, మిషనరీ అందిస్తామని, అలాగే జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంత వాసులకు 100 మందికి జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలు కల్పించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సెట్విన్ అమీనా, ఎస్సి కార్పొరేషన్ ఇడి రామాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ సాకి ఆనంద్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News