Wednesday, January 22, 2025

తైవాన్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ

- Advertisement -
- Advertisement -

తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తైవాన్ రాజధాని తైపీలో భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. తైవాన్‌లోని హువాలియన్ పట్టణానికి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని యుఎస్‌ఎ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు వివరించారు. భూప్రకంపనలు ఎక్కువగా ఉండడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. జపాన్ దీవులకు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసి పడే అవకాశ ఉందని అధికారులు పేర్కొన్నారు. జపాన్ సైతం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 1999లో 7.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో 2400 మంది తైవాన్ ప్రజలు చనిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News