- Advertisement -
తైవాన్ భయాందోళనలు
తైపీ: ప్రజాస్వామిక దీపమైన తైవాన్‌పై చైనా 2025 నాటికల్లా పూర్తిస్థాయి దాడి చేయవచ్చని ఆ దేశ రక్షణ మంత్రి చియు కుయో-చెంగ్ బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి గత నాలుగు రోజుల్లో చైనా వాయుసేనకు సంబంధించిన 150 విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని, చైన తమ ద్వీపాన్ని వేధించడం మానుకోలేదని ఆయన వివరించారు.
గత 40 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత స్థాయికి చైనాతో మిలిట్రీ ఉద్రిక్తతలు పెరిగాయని చియు కుయో-చెంగ్ తెలిపారు. తైపీ, చైనాల మధ్య మునుపెన్నడూ లేనంతగా ఉద్రిక్తతలు పెరిగాయి.
- Advertisement -