Thursday, December 26, 2024

పార్టీ అధ్యక్ష పదవికి తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌ రాజీనామా

- Advertisement -
- Advertisement -

తైపే (తైవాన్ ) : అధికార డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో పరాజయం సంభవించడంతో పార్టీ అధ్యక్ష పదవికి తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌ శనివారం రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురుకావడంతో సంప్రదాయం ప్రకారం ఆమె తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆమె అన్నారు.

తైవాన్ ఓటర్లు స్థానిక ఎన్నికల్లో విపక్ష నేషనలిస్టు పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. చైనా నుంచి బెదిరింపులపై తలెత్తిన ఆందోళనలే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. నేషనల్ పార్టీ మేయర్ అభ్యర్థి చియాంగ్ వాన్ ఇన్ రాజధాని తైపేలో విజయం సాధించారు. తయోయుయాన్, తైచుంగ్, న్యూ తైపే సిటీల్లో కూడా మేయర్ స్థానాలను నేషనల్ పార్టీ అభ్యర్థులే దక్కించుకోగలిగారు. స్హించు మేయర్ పీఠాన్ని తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కవో హుంగ్ యన్ గెలుచుకున్నారు. 13 కౌంటీలు, 9 సిటీలకు మేయర్లు, కౌన్సిలు సభ్యులు, ఇతర స్తానిక నాయకులు ఎన్నికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News