- Advertisement -
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించలేదని జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా తాజ్ బంజారా పన్నుబకాయిలు చెల్లించలేదు. రూ.1.40 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినాహోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -