Monday, December 23, 2024

తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

- Advertisement -
- Advertisement -

తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపింది. ఆగ్నేయ ఢిల్లీ లోని సరితా విహార్ వద్ద మూడు రైలు బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు వెంటనే బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఓఖ్లాతుగ్గకాబాద్ మధ్య సర్వీస్‌లందిస్తున్న ఈ రైలులో నాన్ ఏసీ ఛైర్ కార్ డి3 డి4 కోచ్‌లు మంటలకు పూర్తిగా దగ్ధమైనట్టు డి2 పాక్షికంగా దెబ్బతిన్నట్టు ఢిల్లీ ఫైర్‌సర్వీసెస్ అధికారి తెలియజేశారు. అయితే మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం 4.24 గంటల సమయంలో తాజ్‌ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్టు సమాచారం అందింది. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News