Tuesday, January 7, 2025

తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారులను పరుగులు పెట్టించింది. చివరికి బూటకమని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం గుర్తు తెలియని ఖాతా నుంచి ఓ మెయిల్ వచ్చింది. తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామన్నది ఆ మెయిల్ సారాంశం. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబు నిర్వీర్యబృందాలు, డాగ్‌స్కాడ్ , ఇతర బృందాలు తాజ్‌మహల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.

అయితే అనుమానాస్పద వస్తువులేవీ కనిపించక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజ్‌మహల్ చుట్టూ భద్రతను మరింత పెంచినట్టు ఏసీపీ సయీద్‌అరీబ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెయిల్ వచ్చిన వెంటనే ఆగ్రా పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారమందించామని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వాత్స తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News