Monday, December 23, 2024

మర్రి జనార్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -
సిఈఓ వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చంపుతానని బెదిరించిన నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ కోరారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, రాజేశ్ కుమార్‌తో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ నెల 27వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా బొప్పలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతానని బిఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి బెదిరించారని వారు వెల్లడించారు. అందుకు సంబంధిత వీడియో క్లిప్పింగ్‌ను ఎన్నికల అధికారి అందజేశారు. అదే విధంగా సూర్యాపేట కౌన్సిలర్ రేణుక తన భర్తకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల తీరుపై ఎన్నికల సంఘం దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News