Thursday, January 23, 2025

ప్రకాశ్‌రాజ్ పై చర్యలు తీసుకోండి : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశం, సమాజంపై గౌరవం లేని నటుడు ప్రకాశ్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయమై రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ ప్రధాని గురించి జోకర్ అని అవహేళనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. 534 మంది పార్లమెంటు సభ్యులను ‘బంచ్ ఆఫ్ జోకర్లు‘ గా సంబోధించడం చాలా బాధాకరమని తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. నటుడు ప్రకాశ్ రాజ్ పై వెంటనే హోంశాఖ చర్యలు తీసుకోవాలని, ఆయన ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతిని నిరాకరించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News