Sunday, January 19, 2025

ఎస్సీ , ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసిన బిజెపి నేత రఘనందన్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఓ ప్రధాన పార్టీ తరపున ప్రచారం చేశారని బిజెసి సీనియర్ నాయకులు రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, అతని భార్య సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పదవిలో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో డబ్బు, మద్యం పంపిణీలో చురుకుగా పాల్గొన్నారని ఇందుకు సంబధించిన పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. అధికార హోదాను దుర్వినియోగానికి పాల్పడిన చైర్మన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిపై గవర్నర్ స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News