Thursday, January 23, 2025

నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎండి అన్నమనేని గోపాలరావు

హైదరాబాద్ : నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ నివారించాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థ కార్పోరేట్ కార్యాలయములో మంగళవారం సంస్థ డైరెక్టర్లు బి. వెంకటేశ్వర రావు, పి. గణపతి, పి. సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి , వి.తిరుపతిరెడ్డి తదితర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ దోభీఘాట్, నాయిబ్రాహ్మణ, లాండ్రీ షాపుల సర్వీసులు పెండింగ్ లో ఉన్న వాటిని సకాలంలో మంజూరు చెయ్యాలన్నారు. అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ నివారించాలన్నారు. కాలిపోయిన, ఆగిపోయిన మీటర్లను తక్షణమే మార్చాలన్నారు. నియంత్రికల వైఫల్యాలను తగ్గించాలని, రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. రెండు సంవత్స రాలు పైబడిన వర్క్ ఆర్డర్లు పూర్తి చెయ్యాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సాధ్యమైనంత తొందరగా మంజూరు చెయ్యాలన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్ళు చేస్తు అలాగే రాని బకాయిల వసూళ్ళు కూడా పెంచాలన్నారు. ఓవర్ లోడ్ ఫీడర్లు, డిటిఆర్ ను గుర్తించి వాటిపై భారం పడకుండా లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. మీటర్ రీడింగ్ లను చెక్ చెయ్యాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హెచ్‌ఆర్‌డి ) బి. వెంకటేశ్వర రావు, డైరెక్టర్(ఐపిసి ఆర్‌ఎసి) పి.గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) పి.సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News