Monday, December 23, 2024

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : మండలంలోని జిల్లేల గ్రామంలో బుధవారం ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్, కామినేని ఆసుపత్రి వైద్యులు ఆధ్వర్యంలో తలకొండపల్లి జిల్లా పరిషత్ సభ్యులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ వెంకటేష్, అతని కుమారుడు డాక్టర్ అఖిల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో 186 మందికి బిపి, షుగర్, వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన మందులను ఉచితంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు.

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అనంతరం యువకులు, గ్రామ పెద్దలు జెడ్పిటిసి వెంకటేష్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య, పాండు గౌడ్, రవి గౌడ్, తలకొండపల్లి ఎంపిపి నిర్మల శ్రీశైలం గౌడ్, ఎంపిటిసి శోభ శేఖర్ రెడ్డి, పాండు గౌడ్, కొమ్మకోని రవి, బాల్ జంగయ్య, రమేష్, నరేష్, రాములు, సురేష్ మోడీ, దారమోని గణేష్, విష్ణు, కిషోర్ రెడ్డి, దివాకర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News