Saturday, December 21, 2024

అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:యువత విద్యా, ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థాని క ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన విద్యా ది నోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క లెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యారం గంలో గణనీయమైన ప్రగతి సాధించిందని, యువత స్వయంకృషితో, నిబ ద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల పై ఆధారపడకుండా స్వయంగా సమృద్ధి సాధించేందుకు చదు వుకుంటూ, పార్ట్ టైం ఏదో ఒక ఉద్యోగం నమస్తే ఏం చెప్పాలి చేయాలని పని చేయడం వల్ల డబ్బు యొక్క విలువ, కష్టపడి పనిచేసే తత్వం అలవాటు అ వుతుందని అన్నారు. దేశ పౌరులు అయినందుకు 1.10.203 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని ఎస్ ఆర్ ఆర్ కళాశాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తర ఫున అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు.

జిల్లా గ్రంధాలయ సం స్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఆర్ కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎ స్ ఆర్ ఆర్ కళాశాల తనకు నాయకత్వ లక్షణాన్ని అందించిన మాతృ సంస్థ అని, ప్రభుత్వం తరపున కళాశాల వసతి గృహాలు, ఫర్నిచర్ నూతన గదుల నిర్మాణానికి తగిన ఆర్థిక వనరుల్ని ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కలువకుంట రా మకృష్ణ అధ్యక్షత వహించి జిల్లా డిగ్రీ కళాశాలలో పెరిగిన ప్రవేశాలు, కో ర్సులు, ప్రగతిశీల మార్పులను ఉదహరించారు. అంతకుముందు కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

200 మంది ఎన్ సీసీ కెడేట్లు జిల్లా కలెక్టర్ గారికి గౌరవ వందనాన్ని, ఘన స్వాగతం పలికారు. తెలంగాణ దశాబ్ది వే డుకల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాసం క్విజ్ వేషధారణ, పా టల పోటీలు నిత్య పోటీలు తెలంగాణ వంటల పోటీల విజేతలకు, పూర్వ వి ద్యార్థుల సంఘం తరఫున డాక్టర్ కే సురేందర్ రెడ్డి ద్వారా బహుమతులు పు స్తకాల్ని అందించారు. ఉత్తమ ప్రిన్సిపాల్ గా ఎంపికైన ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణను, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం హిమబిందు, డాక్టర్ బిక్షపతి అధ్యాపకులు ఉమామహే శ్వరి, డాక్టర్ మల్లారెడ్డి, అర్చన ఓదేలు కు మార్, సతీష్, శంకర్, కామరాజు, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News