Monday, December 23, 2024

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి

Take advantage of sports camps

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన శిక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. ఈ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నా రు. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమవంతు కృషి చేయాలని చైర్మన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News