Saturday, November 23, 2024

జాబ్‌మేళాకు సద్వినియోగం చేసుకొని స్థిరపడాలి

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్: నిరుద్యోగ యువత జాబ్‌మేళలను సద్వినియో గం చేసుకోవాలని తద్వారా ఉపాధి అవకాశాలు లభించి అర్థిక భరోసా లభిస్తుందని కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్‌నాయక్, నార్త్‌జోన్ డిసిపి చందనదీప్తి, టిఎస్‌ఈడబ్లుఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరై ఉద్యోగం సాధించిన యువతకు ఆఫర్‌లేటర్లను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రీశాంక్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ మూడవవార్డు పరిధిలోని మడ్‌పోర్డ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాబ్‌మెళాకు విశేష స్పందన లభించింది. జాబ్‌మేళాలో దాదాపుగా 101 కంపెనీలు పాల్గొన గా జాబ్‌మెళాలో 1437 మంది నిరుద్యోగ యువత జాబ్‌మెళాలో పాల్గొన్నారు.

419 మందికి వివిధ సంస్థలు కంపెనీలో ఉద్యోగ ఆవకాశాలు లభించారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సరియైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ఒకేచోట దాదాపు 100పై గా కంపెనీలో దరఖాస్తు చేసుకొని తమ ప్రతిభ తగ్గ ఉద్యోగం సంపాదించటం ఆనందంగా ఉందని నిరుద్యోగ యువత పేర్కొన్నారు. ఈసందర్బంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ సరైన ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారికి ఇలాంటి జాబ్‌మేళాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అనంతరం నిరుద్యోగ యువతకు భోజనం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం క్రీశాంక్ మాట్లాడుతూ జాబ్‌మేళలకు సహకరించిన కంపెనీ, సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇంత పెద్ద ఎత్తున్న జాబ్‌మెళాకు స్పందన రావటం సంతోషంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News