- మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య దేవేందర్‌యాదవ్
కొత్తూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును మున్సిపాలిటీలోని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కోవాలని కొత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యా దవ్ అన్నారు. మున్సిపాలిటీలోని స్టేషన్ తిమ్మాపూర్‌లోగల 12వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు కంటి సమస్యలతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.
పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఎక్కడ క్యాంపు జరిగినా ప్రతి ఒక్కరు కంటి పరీ క్షలు చేయించుకోవాలన్నారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి కంటి అద్దాలతోపాటు అవసరమైనవారికి ఉచితంగా మందులు, శస్త్ర చికిత్స సైతం చేయడం జరుగుతుందన్నారు. కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ వీరేందర్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, బ్యాగరి ప్రసన్నలత యాదయ్య, మాధవి, గోపాల్‌గౌడ్, డాక్టర్ హరికృష్ణ, శంకరయ్య, పాశం గణేష్, సురేష్, నర్సింగ్‌రావు, వన్నాడ వెంకటేష్, సీహెచ్ సురేష్, శ్రీనివాస్, ఆంజనేయులు, సత్యనారాయణ, చంద్రశేఖర్, నర్సింహారెడ్డి, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.