Monday, December 23, 2024

ఆరోగ్య మహిళ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా అందు తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు అందుతున్న ఎనిమిది రకాల వైద్య సేవలను పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరారు. వైద్య సేవలు అందిస్తున్న తీరును మహిళలతో వాటి వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News