Monday, December 23, 2024

స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26,27లో ఓటరు జాబితాలలో సవరణలు, మార్పులు , చేర్పులు చేసుకునే కార్యక్రమం జరుగుతుందని అందరూ బూత్ లెవల్ అధికారులు తమ తమ పోలింగ్ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

ప్రారంభమైన కార్యక్రమాన్ని గట్టు మండలం మాచర్ల, ఆలూరు పోలింగ్ స్టేషన్ కేంద్రాలలో జరుగుతున్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని సవరణలో మార్పులు, చేర్పులు, ఏమైనా ఉంటే సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని, గ్రామాలలో చనిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి విచారణ చేసి తొలగించాలని, బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News