Monday, December 23, 2024

ఓటరు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని 18 ఏళ్లు నిండిన వారంతా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట యువజన నాయకులు ముఠా జైసింహ అన్నారు. బిఆర్‌ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్క రికీ అవసరమే అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదును కల్పించిని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఓటరు జాబితాలో ఏమైనా సహా య, సహకారాలను బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందిస్తారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిదన్నారు. ఓటు హక్కును పొందేందుకు అర్హులైన వారంతా ఫారం 6 ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్, నాయకులు శంకర్ గౌడ్, వంగాల నర్సింగ్, మహమ్మద్ అలీ, మునావర్ చాంద్, జబ్బార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News