Thursday, December 26, 2024

 ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి  ః పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ పనులు సజావుగా నిర్వహించడంతో పాటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శుక్రవారం ఉదయాన్నే వనపర్తి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని 26, 29, 33వ వార్డులలో తిరుగుతూ పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, ఎవరైనా ఇళ్ల నుండి తమ చెత్తను ప్లాస్టిక్‌ను మురుగు కాలువలో పడేస్తే అలాంటి వారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి 15 రోజులకు మున్సిపాలిటీ ఆవరణలోనే హెల్త్ క్యాంపు పెడతామని, అక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి నెలా జీతం పడుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనాన్ని, టౌన్ హాల్, లలిత కళా తోరణం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని నాణ్యతలో లోపం లేకుండా చేసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News