Thursday, November 21, 2024

కరోనాపై ఇంకా జాగ్రత్తలు అవసరం..

- Advertisement -
- Advertisement -

కష్టకాలంలో సేవలు అందించినందుకు కరోనా వారియర్స్‌కు సన్మానం: సిఐ

మనతెలంగాణ/సిర్పూర్ యు: ప్రజలు ఇంకా కరోనా పట్ల జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం ఎంతైన ఉందని జైనూర్ సిఐ హనోక్, సిర్పూర్‌యు తహసిల్దార్ భుజంగ్‌రావులు అన్నారు. మంగళవారం సిర్పూర్ యు ఎంపిడిఓ కార్యాలయంలో అదివాసి మిత్ర వెల్ఫర్ సోసైటి అధ్వర్యంలో కరోనా వారియర్స్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పోలీసులు, వైద్యులు, రెవెన్యూ శాఖ అధికారులు, జర్నలిస్టులు ఎనలేని కృషి చేశారని అన్నారు. కరోనా వ్యాధి దేశం నుండి పూర్తిగా పోలేదని, ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో కరోనా టీకాలు అందుబాటులో వచ్చే వరకు వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. అయా శాఖలతో జర్నలిస్టులు చేసిన సేవలు కొనియాడారు. మిత్ర వెల్ఫర్ సోసైటి అధ్వర్యంలో కరోనా వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య శాఖ అధికారులతో పాటు జైనూర్, సిర్పూర్‌యు, లింగాపూర్ మండలాల విలేకరులకు శాలువ కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విష్ణువర్ధన్, మండల విద్యాధికారి కుడ్మేత సుధాకర్, మిత్ర వెల్ఫర్ సోసైటి జిల్లా అధ్యక్షులు అడ వెంకటేశ్, మండల వైద్యాధికారి నరేష్, జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, మండలాల విలేకరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News