Tuesday, December 17, 2024

నాలుగో స్పిన్నర్‌గా అతడిని తీసుకోండి: అనిల్ కుంబ్లే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఓటమిని చవిచూసిన నేపథ్యంలో రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియాలో భావిస్తోంది. రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ గాయాల పాలు కావడంతో రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో భారత జట్టుకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఆ ఇద్దరు బదులుగా సర్ఫారాజ్ ఖాన్, ఎడమ చేతి వాట స్పిన్నర్ సౌరభ్ కుమార్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించారు.

రెండో టెస్టులో నాలుగో స్పన్నర్ అవసరమని భావిస్తే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోవడం బెటర్ అని తెలిపారు. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్ వేరియేషన్స్ ఉంటాయని వివరించారు. ఉప్పల్ పిచ్‌లాగానే విశాఖపట్నం పిచ్ కూడా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించొచ్చని పేర్కొన్నాడు. ఉప్పల్ పిచ్‌తో పోలిస్తే విశాఖపట్నం పిచ్ కాస్త పేస్ బౌలింగ్ సహకరిస్తుందని చెప్పారు. స్పిన్ బౌలింగ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు జాగ్రత్తగా ఆడాలని సూచించారు. స్పిన్ బౌలింగ్‌లో భారత జట్టు బ్యాట్స్‌మెన్లు ఫుట్‌వర్క్ సరిగా వాడకపోవడంతోనే వికెట్లు పారేసుకున్నారని సలహా ఇచ్చారు. కుల్‌దీప్ యాదవ్ చివరి టెస్టు 2022 డిసెంబరులో బంగ్లాదేశ్‌తో ఆడారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి ఎనిమిది వికెట్లు తీశాడు. మొత్తం ఎనిమిది టెస్టులు ఆడి 34 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News