Thursday, December 26, 2024

ఆ పార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి: ఓటర్లకు మన్సూర్ అలీఖాన్ సూచన

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓట్ల కోసం వచ్చే అన్నాడిఎంకె నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ సూచించారు. ఇండియా జననాయగ పులిగల్ పేరుతో పార్టీని స్థాపించిన ఆయన వేలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన మద్దతుదారులకు అన్నాడిఎంకే నేతలతో సంప్రదింపులు జరిపి డబ్బులు తీసుకోవాలని ఆయన సూచించడంపై ఆడియో ఒకటి విడుదలైంది. ఈ ఆడియో గుడియాత్తం, పేర్నాంపట్టు తదితర ప్రాంతాల్లో వాట్సాప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై ఎన్నికల సంఘం అధికారుల ఆదేశంపై జిల్లా నిఘా విభాగం పోలీస్‌లు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News